కరోన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లకు సీఎం కేసీఆర్ సూచించారు. జూడాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసిన సీఎం… వారికి ఇచ్చేవి న్యాయమైనవి అయితే కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని స్పష్టం చేసారు. ప్రగతి భవన్ లో కరోన ,వ్యాక్సినేషన్ ప్రక్రియ పై నేడు సిఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
సమీక్ష లో జూడాల సమ్మె అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన అధికారులు… వారు విధుల్లో పాల్గొనడం లేదని చెప్పారు. స్పందించిన కేసీఆర్ వెంటనే విధుల్లోకి రావాలని ఇది పద్ధతి కాదని అన్నారు. సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 15శాతం పెంచాలని నిర్ణయించారు. కోవిడ్ సేవల కొరకు కొనసాగుతున్న వైద్య విద్యార్థులకు కూడా సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే వేతనం ఇవ్వాలని సీఎం సూచనలు చేసారు.