Tuck Jagadish :ఫ్యామిలీ ఎంటరైనర్‌ గా ”టక్‌ జగదీష్‌” ట్రైలర్‌

-

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా ”టక్ జగదీష్”. షైన్ స్క్రీన్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా లో జగపతి బాబు కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.

అయితే ఫైనల్‌ గా ”టక్ జగదీష్” సినిమా ను వచ్చే నెల 10 న అంటే వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఇలా ఉండగా… తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను కాసేపటి క్రితమే… చిత్ర బృందం వదిలింది.

ట్రైలర్‌ చూశాక… ఈ సినిమా పూర్తిగా ఫ్యామిలీ సెంటీమెంట్‌ ఆధారంగా నడుస్తుందని తెలుస్తోంది. అలాగే.. ఈ సినిమాలో చాలా సెంటీమెంట్‌ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇక అటు ఇద్దరు హీరోయిన్లు కూడా…కీలకంగా ఉన్నట్లు మనంకు అర్థమౌవుతోంది. ఇక ట్రైలర్‌ చూసాక… ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. కాగా… ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ లో ఈ సినిమాను విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news