Turnip: ఈ కూరగాయతో డయబెటిక్‌, బీపీ, ఓవర్‌ వెయిట్‌కు చెక్‌ పెట్టేయొచ్చు..!!

-

మనం తినేవి కాక మనం చూడనివి, అసలు తెలియని కూరగాయలు చాలా ఉన్నాయి.. వాటి పేర్లు కూడా మీరు విని ఉండరు.. బీట్‌రూట్‌లానే ఓ కూరగాయ ఉంటుంది.. అది టర్నిప్‌.. రుచిలో బంగాళాదుంప, కనిపించడంలో ముల్లంగి, బీట్ రూట్‌లా ఉంటుంది.. భారతదేశంలో దీన్ని ‘షల్గం’ అని కూడా పిలుస్తారు. తెలుపు, ఊదారంగుల్లో ఇది లభిస్తుంది. ఎన్నో పోషకాల మూలం ఈ కూరగాయ.. కాల్షియం, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. క్రూసిఫెరస్ కుటుంబానికి చెందిన ఈ కూరగాయ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

టర్నిప్‌ కూరగాయతో లాభాలు..

రక్తపోటు

టర్నిప్‌లో రక్తనాళాలని ఆరోగ్యంగా ఉంచే డైటరీ నైట్రేట్‌లు ఉన్నాయి.. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల శరీరం నుంచి సోడియం విడుదల చేస్తుంది. దాని వల్ల రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. ధమనులు వ్యాకోచించేలా చేస్తుంది. గుండెకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది.

క్యాన్సర్ ప్రమాదం..

టర్నిప్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.. వీటిలో క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పని చేసే సమ్మేళనాలు ఉంటాయి. యాంటీ క్యాన్సర్ ప్రభావం కలిగిన ఈ కూరగాయ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం 23 శాతం తక్కువగా ఉంటుందని శాస్తవేత్తలు చెబుతున్నారు.

యాంటీ డయాబెటిక్ లక్షణాలు

ఈ కూరగాయలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది తినడం వల్ల గ్లూకోజ్ స్థాయిలని నియంత్రిస్తుంది. మధుమేహ రోగులు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయని అధ్యయనం ద్వారా కనుగొన్నారు..

బరువు తగ్గడంలోనూ..

అధిక మొత్తంలో ఫైబర్, తక్కువ కేలరీలు కలిగి ఉండటం వల్ల ఇది పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. దీని వల్ల అతిగా తినడాన్ని నివారిస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

పేగు సమస్యలు తగ్గిస్తుంది..

ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పెద్ద పేగులో ఒత్తడి, వాపుని తగ్గిస్తుంది. అధిక ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల పేగులకు మంచి చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థకి ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తుంది. మలబద్ధకం సమస్యని నివారిస్తుంది.

రోగనిరోధక శక్తి ఇస్తుంది

విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఈ కూరగాయ రోగనిరోధక వ్యవస్థని బలపరుస్తుంది. ఇందులోని గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని నివారిస్తుంది.
 టర్నిప్‌ను ముక్కలుగా కోసి బంగాళాదుంప మాదిరిగా ఉడికించుకుని కూర చేసుకుని తినొచ్చు. టర్నిప్‌ను సలాడ్ లేదా సూప్‌కి ఉపయోగించుకోవచ్చు
చిరుతిండిగా కూడ తినొచ్చు. టర్నిప్ ముక్కలు కాల్చి ఉప్పు, మిరియాల పొడి నిమ్మరసం జోడించుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. కాదా కనిపిస్తే వదిలిపెట్టుకుండా తెచ్చుకోండి మరీ..!!

Read more RELATED
Recommended to you

Latest news