న్యూఢిల్లీ: ట్విట్టర్ ఇండియా చీఫ్ మనీశ్ మహేశ్వరీకి ఊరట లభించింది. కేసుల విచారణ నిమిత్తం ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. గజియాబాద్‌లో ముస్లిం వ్యక్తిపై దాడికి సంబంధించి ట్వీట్లపై ప్రశ్నించడం కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు ట్విట్టన్ ఇండియా చీఫ్ మనీశ్‌కు సమన్లు జారీ చేశారు. ఈ విషయమై రక్షణ కోరుతూ మనీశ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
ట్విట్టర్ ఇండియా చీఫ్ మనీశ్‌పై ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఉద్దేశ పూర్వకంగా అభియోగాలు మోపారు అని కోర్టు ఆక్షేపించింది. అల్లర్లు, శత్రుత్వం పెంచడం, నేరపూరిత కుట్ర ఆరోపణలన్నీ దుర్భుద్ధితో పెట్టిన కేసులని పేర్కొంది. ఇవన్నీ సోషల్ మీడియా సంస్థను ఇబ్బందులకు గురిచేసే ఉద్దేశంతో పెట్టినవని స్పస్టం చేసింది.
దేశంలో తీసుకువచ్చిన నూతన ఐటీ చట్టాలను ట్విట్టర్ అమలు చేయకపోవడంతో ‘మధ్యవర్తిత్వ హోదా’ను కోల్పోయిన విషయం విధితమే. ఈ నేపథ్యలో ట్విట్టర్‌పై నమోదు చేసే కేసులపై ఆ సంస్థనే నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుంది.