ఎట్టకేలకు గ్రీవెన్స్​ అధికారిని నియమించిన ట్విట్టర్‌

-

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐటీ నిబంధనల నేపథ్యంలో కేంద్రానికి, ట్విట్టర్‌కు మధ్య వివాదం కొనసాగుతోన్న విషయం తెల్సిందే. ట్విట్టర్‌ నూతన ఐటీ నిబంధనలను పాటించకపోవడం పట్ల కేంద్రం ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ట్విట్టర్‌ కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నూతన ఐటీ నిబంధనలను ట్విట్టర్‌ ధిక్కరించాలనుకుంటోందా? అని ఇటీవలే ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో నూతన ఐటీ నిబంధనల ప్రకారం ఫిర్యాదుల స్వీకరణకు గ్రీవెన్స్‌ అధికారిని నియమించేందుకు తమకు 8 వారాల గడువు కావాలని ట్విట్టర్‌ ఢిల్లీ హైకోర్టును కోరింది.

ట్విట్టర్‌/twitter
ట్విట్టర్‌/twitter

అయితే 8 వారాల గడువు కోరిన ట్విట్టర్‌ మూడు రోజుల్లోనే రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారి (ఆర్‌జీఓ)ని నియమించింది. భారత్‌కు చెందిన వినయ్​ప్రకాశ్‌ను గ్రీవెన్స్​ అధికారిగా నియమించింది. ఈ మేరకు ట్విట్టర్‌ తన వెబ్‌సైట్‌లో ఆర్‌జీఓ వివరాలు ఉంచింది. ఆర్‌జీఓ ఈమెయిల్ ​ఐడీకి వినియోగదారులు తమ ఫిర్యాదులను పంపించవచ్చని తెలిపింది. భారత ప్రభుత్వ నూతన ఐటీ చట్టం ప్రకారం 50 లక్షల యూజర్లు దాటిన సామాజిక మాధ్యామాలు తప్పనిసరిగా అధికారులను రెసిడెంట్​ గ్రీవెన్స్​ అధికారి, చీఫ్ కంప్లయన్స్​ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ ఈ ముగ్గురిని నియమించుకోవాలి. వారు కూడా భారత్‌లో నివసిస్తూ ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news