ట్విట‌ర్ పోల్ : తెలుగు ఆర్ఆర్ఆర్ కు క‌న్న‌డ కేజీఎఫ్ గ‌ట్టి పోటీనా ?

-

ఆర్ఆర్ఆర్ అనే విజువ‌ల్ వండ‌ర్ ను
కేజీఎఫ్ 2 ఓవ‌ర్ కమ్ చేయ‌డం జ‌ర‌గ‌ని ప‌ని

కానీ ఒక నాడు కేజీఎఫ్ క్రియేట్ చేసిన హ‌వాను
మ‌రువ‌లేం క‌నుక ఎవ‌రి క‌ష్టం వారిదే
ఎవ‌రి విజ‌యం వారిదే!
అంతిమం భార‌తీయ సినిమా విజ‌యం
జ‌య‌హో కేజీఎఫ్..జ‌య‌హోఆర్ఆర్ఆర్

క‌న్న‌డ తీరాన ఎన్టీఆర్ ఫ్యాన్స్
తెలుగు నాట య‌ష్ ఫ్యాన్స్

ఇవాళ అంతా కోరుకుంటున్న‌ది భార‌తీయ సినిమా గెల‌వాల‌ని..
వేల మంది శ్ర‌మ వేదం ఫ‌లించాల‌ని..ఆర్ఆర్ఆర్ హిట్
కేజీఎఫ్ 2 హిట్..
ఈ రెండు సినిమాల ఫ‌లితాలు
అనూహ్య విజ‌య తీరాల‌ను చేరుకుంటే చాలు..
ఎన్నో క‌ల‌ల‌కు సాకారం అర్థం దొరికింద‌నే భావించాలి.

“ఆర్‌ ఆర్‌ ఆర్‌” మూవీ.. దీని కోసం ఎంతో మంది…చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు ప్రేక్షకులే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం.. వెయిట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. బాహుబలి తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం… జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రూ.336 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించారు. జనవరిలోనే రిలీజ్ కావాల్సి ఉన్నా..కరోనా కారణంగా సినిమాకు అవాంతరాలు ఏర్పడ్డాయి. తాజాగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ రిలీజ్ కాబోతోంది.

అటు ట్రిపుల్ ఆర్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పాయి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు. సినిమా టికెట్ రేట్లు పెంచుతూ.. రెండు ప్రభుత్వాలు జారీ చేశాయి. అయినప్పటికీ..ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ చిత్ర బృందంలో ఏదో ఒక అలజడి ఉంటూ వస్తోంది.
తమ కలెక్షన్లకు ఎక్కడ దెబ్బ వస్తుందోనని..భయపడుతున్నారు. కేజీఎఫ్‌ 2 సినిమా ఏప్రిల్‌ 14 వ తేదీన విడుదల కానుండటమే.. ఈ భయానికి కారణం. కేజీఎఫ్‌ 2 సినిమాను ప్రశాంత్‌ నీల్‌ డైరెక్ట్‌ చేస్తుండగా..యశ్‌ హీరోగా నటిస్తున్నారు.
కేజీఎఫ్ పార్ట్ 1 విజయవంతమై.. రికార్డులను సృష్టించింది. ఇక పార్ట్‌ 2 ఇంకా బాగుంటుందని ప్రేక్షకుల మదిలో ఉంది.

ఈ సినిమా కర్ణాటకలో కంటే..ఎక్కువగా తెలుగులో కలెక్షన్లను రాబట్టింది. అలాంటిది.. రూ.336 కోట్ల ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదల అయ్యాక…కేవలం 15 రోజుల్లోనే కేజీఎఫ్‌ రిలీజ్‌ అవుతోంది. ఇలాంటి తరుణంలో..ఆర్‌ఆర్‌ఆర్‌ కు దెబ్బ పడే ఛాన్స్‌ లేకపోలేదు. ఈ విషయాన్ని.. ఇప్పటికే టాలీవుడ్‌ ప్రముఖులు చెబుతున్నారు. అయితే…ఇలాంటి సమస్యలు రాకూడదనే.. మొన్న కర్ణాటకలో ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేసారని వార్తలు వస్తున్నాయి. అయితే.. దీనిపై క్లారిటీ రావాలంటే.. 15 రోజులు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news