కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి నిప్పులు చెరిగారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇండియా అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని… కచ్చితంగా బిజెపి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వాన్ని దించేందుకు… ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలని తాము ఇంకా అనుకో లేదన్నారు.
కానీ ఓ కొత్త రూపంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని కేసీఆర్ ప్రకటించారు. అది మరో జాతీయ పార్టీ రూపంలో కూడా రావచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న రెండు జాతీ య పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు. ఖచ్చితంగా బిజెపి ప్రభుత్వం వచ్చే ఎన్ని కల్లో ఓడిపోవాలని లేకపోతే ఇండియాకు ప్రమాదం అని ఆయన వెల్లడించారు. ఈ జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర కీలకమైందని ఆయన పేర్కొన్నారు. తనపై సోష ల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని… అలాంటి ప్రచారాలకు తాను భయపడనని స్పష్టం చేశారు.