ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఎలా అయితే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారో, అలానే టీఆర్ఎస్ పార్టీకి కూడా తల నొప్పి మొదలయింది. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ కారులని పట్టించుకోవడం లేదని శాశన మండలి మాజీ ఛైర్మన్ కె స్వామి గౌడ్ పేర్కొన్నారు. పార్టీ మారిన కొంత మంది నేతలు ఉద్యమకారుల మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని ఆయన అన్నారు.
కేసీఆర్, కేటీఆర్ ల అపాయింట్ మెంట్ కోసం ఇప్పటికే నెలల తరబడి ఎదురు చూస్తున్నానని కానీ అది దొరికే దారి కనపడం లేదని ఆయన అన్నారు. అయితే తాను పార్టీ మారే ప్రశక్తి లేదన్న ఆయన పార్టీ మీద తనకు ఎలాంటి కోపం లేదని అన్నారు. పార్టీలో అందరినీ కలుపుకు పోయేలా కేసీఆర్ ఆదేశాలు ఇవ్వాలని ఆయన అన్నారు. ఇక బీసీలకు అన్యాయం విషయం మాట్లాడుతూ ఆ మాట నిజమే కదానని మళ్ళీ చెప్పుకొచ్చారు ఆయన. ఈ మధ్య కాలంలో ఈయన చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. కాంగ్రెస్ పార్టీ నేత, టీఆర్ఎస్ వాళ్ళు బద్దశత్రువుగా భావించే రేవంత్ రెడ్డిని ప్రశంసించడం కూడా టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారాయి.