కరోనా కట్టడి పై ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరగనుంది. 12 గంటలకు క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు సీఎం జగన్. నియంత్రణ పై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని, పదో తరగతి పరీక్షలు రద్దు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే రాత్రి కర్య్ఫూ విధించే యోచనలో సర్కార్ ఉందని అంటున్నారు. ఇంటర్ పరీక్షలు వాయిదా వేసే నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందని, అలాగే స్కూళ్లకు సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నదని అంచనా.
ఇక దేవాలయాల్లో, మత సంస్థల్లో సైతం కరోనా ఆంక్షలు, బార్లు, రెస్టారెంట్లు పై ఆంక్షలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అంటున్నారు. అలాగే అదే సమయంలో మార్కెట్లు, దుకాణాల విషయంలో సమయం ఆంక్షలు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అంటున్నారు. ఇక వ్యాక్సినేషన్, కోవిడ్ కేర్ సెంటర్ల పై ప్రత్యేక ఫోకస్ పెట్టి వాలంటీర్లతో ఇంటింటికి ఆరోగ్య సర్వే చేయించే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నారని తెలుస్తోంది.