రోజాకు అస్వస్థత.. రెండు మేజర్ ఆపరేషన్ లు !

Join Our Community
follow manalokam on social media

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం చెన్నైఅపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.. ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయని అయితే ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆమె భర్త సెల్వమణి ఒక ఆడియో విడుదల చేశారు. అయితే ఆమెను మరో రెండు వారాల పాటు కలవడానికి ఎవరు రాకూడదని డాక్టర్ల సూచించారని సెల్వమణి పేర్కొన్నారు.

ఆమె ఐసియు నుంచి జనరల్ రూమ్ కి షిఫ్ట్ చేశారని ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు. మరో రెండు మూడు రోజుల్లో ఆమె ఆహరం కూడా తీసుకోనున్నారని చెప్పుకొచ్చారు. ఇన్ఫెక్షన్ సోకుతుందనే కారణంగా తమతో పాటు ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదని ఆయన పేర్కొన్నారు. జనవరిలోనే ఈ ఆపరేషన్స్ జరగాల్సి ఉన్నా ఎలక్షన్స్, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిందని ఆయన అన్నారు. 

TOP STORIES

కరోనా సెకండ్ వేవ్: యువతలో కనిపించే 6 అసాధారణ లక్షణాలివే..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా...