మీ ఇంట్లో వాస్తు ప్రకారం ఏ రంగు వేయించుకోవాలో తెలుసా..?

-

సాధారణంగా వాస్తు ప్రకారం రంగులు చేయించుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని అంటూ ఉంటారు. వాస్తు ప్రకారం రంగుల్ని కూడా ఎంచుకోవడం చాలా ముఖ్యం అని పండితులు చెప్తున్నారు. వాస్తు ప్రకారం సరైన చోట సరైన రంగులు వేయడం చాలా ముఖ్యమని వారు చెబుతున్నారు.

లివింగ్ రూమ్ లేదా ఇంట్లో ఆఫీస్ ఉంటే ఎరుపు రంగు, నీలం రంగు లేదా తెలుపు రంగు వేసుకుంటే మంచిది. అలానే తక్కువ షేడ్స్ ఉన్న కలర్స్ ని ఎంచుకోండి. రంగుల వల్ల కూడా అనేకం జరుగుతుంటాయి. గదిలో వున్న రంగు ఆధారంగా ఆకలి, రిలాక్స్, అలసిపోవడం ఇలా చాలా ఆధారపడి ఉంటాయి.

వాస్తు ప్రకారం ఏ గదిలో ఏ రంగు వేయించుకోవాలి అనే విషయానికి వస్తే.. వంట గది లో తెలుపు రంగు వేయించుకోవడం మంచిది. అలానే ఆకుపచ్చ లేదా పసుపు కూడా వేయించుకోవచ్చు. బ్లాక్ గ్రానైట్ లాంటివి ఉపయోగించకుండా ఉంటే మంచిది.

అదే బెడ్ రూమ్ లో అయితే లైట్ కలర్ వేయించుకోవడం మంచిది. క్రీమ్, బ్రౌన్ ఇలాంటివి బెడ్రూమ్ గోడలకి వేయించుకుంటే మంచి వైబ్రేషన్స్ ఇస్తుంది. అదే కపుల్స్ బెడ్ రూమ్ లో అయితే లైట్ పింక్ కలర్ వేయించుకుంటే బాగుంటుంది. ఎక్కువ రంగులు వేయించుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఎక్కువ రంగులు వల్ల సరైన నిద్ర రాదు. అదే లివింగ్ రూం, డైనింగ్ రూమ్, డ్రాయింగ్ రూం లాంటి చోట డార్క్ బ్లూ, వైట్ మరియు గ్రీన్ ఉపయోగించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news