తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల 23న వాయువ్య బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, అదిలాబాద్, నిజమాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, వరంగల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, జనగామ, హనుమకొండ, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా, నారాయణపేట, వనపర్తి జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సైతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.