గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో మరోసారి గంజాయి చాక్లెట్ల కలకలం సంచలనం రేపింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా హాష్ ఆయిల్, గంజాయి చాక్లెట్లను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఆదిభట్ల ప్రాంతంలో హాష్ ఆయిల్ తరలిస్తున్న నలుగురు ముఠాను పట్టుకున్నామని, వారి నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
అదేవిధంగా మరోచోట 3.8 కిలోల గంజాయి చాక్లెట్లను సీజ్ చేసి, వాటిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఈ మధ్య నగరంలో మత్తుపదార్థాలకు సంబంధించి కేసులు రానురాను పెరుగుతున్నాయి.ఏకంగా విద్యార్థులు సైతం మత్తుపదార్థాలను విక్రయిస్తూ పోలీసుల చేతికి చిక్కారు. ఇలాంటి ఘటనలు పెరుగుతుండంతో తల్లిదండ్రులకు పోలీసులు సూచనలు చేస్తున్నారు. పిల్లల యాక్టివిటీస్ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు.