మౌలిక వసతుల్లో దిగజారిన రెండు తెలుగు రాష్ట్రాలు

-

మౌలిక వసతుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు దిగజారాయి. రాష్ట్రాల “లాజిస్టిక్స్ ప్రొఫైల్స్‌”ను నిన్న విడుదల చేశారు కేంద్ర మంత్రి పియూష్ గోయల్. ఈ లిస్ట్‌ లో గుజరాత్‌, హర్యానా, పంజాబ్‌ మొదటి 3 స్థానాల్లో చోటు దక్కింది. 2019లో మూడో ర్యాంక్‌లో ఉన్న ఏపి, 2021 నాటికి తొమ్మిదో ర్యాంక్‌ కు పడిపోయింది. అలాగే, తెలంగాణ 2019లో ఎనిమిదో ర్యాంక్‌లో ఉండగా, 2021 నాటికి 10 ర్యాంక్‌ కు పడిపోయింది.

సోమవారం రాత్రి రాష్ట్రాల లాజిస్టిక్స్ ప్రొఫైల్స్‌ను విడుదల చేశారు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌. అందులో ఆంధ్రప్రదేశ్‌ 2019లో 3.42 స్కోర్‌తో మూడో ర్యాంక్‌లో ఉండగా, 2021 నాటికి 3.17 స్కోర్‌తో తొమ్మిదో ర్యాంక్‌కు దిగజారింది.

రోడ్ల నాణ్యతలో ఏపీకి 3.59 స్కోరు రాగా, రైల్వే మౌలిక వసతుల్లో 3.26 పాయింట్ల లభించాయి. తెలంగాణ విషయానికొస్తే రోడ్ల నాణ్యతలో 3.48 స్కోర్‌ లభిస్తే… రైల్వే మౌలిక వసతుల్లో 3.14 స్కోర్‌ దక్కింది. తెలంగాణ 2019లో 3.22 స్కోర్‌తో ఎనిమిదో ర్యాంక్‌ను సాధించింది. 2021లో 3.14 స్కోర్‌తో పది ర్యాంక్‌కు పడిపోయింది. గుజరాత్‌, హర్యానా, పంజాబ్‌ మొదటి మూడు ర్యాంక్‌లను సాధించాయి.

Read more RELATED
Recommended to you

Latest news