ఊబర్ రైడ్ ని బుక్ చేసుకోవాలనుకుంటున్నారా..? వాట్సాప్ లో బుక్ చేసుకోండిలా..!

-

ఈజీగా ఇక నుండి వాట్సాప్ ద్వారా రైడ్ బుక్ చేసుకునే అవకాశాన్ని తీసుకు వచ్చారు. ఈ ఏడాది ప్రారంభం లోనే ఉబర్ వాట్సాప్‌తో పార్ట్‌నర్‌షిప్ ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే ఉబర్ రైడ్స్ కూడా వాట్సాప్‌ లో చేసుకునే విధంగా సేవలని తీసుకు వచ్చారు.

పూర్తి వివరాలని చూస్తే… దిల్లీ- NCR, లక్నో పరిసర ప్రాంతాల్లోనే ఈ సేవలు ఇప్పుడు అందుబాటులో వున్నాయి. అక్కడ వున్నవాళ్లు ఇప్పుడు ఉబర్ రైడ్ ని వాట్సాప్ ద్వారా బుక్ చేసేయచ్చు. వాట్సాప్‌లో ఒక నంబర్‌కు మెసేజ్ చేసి కొన్ని డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఇతర ప్రాంతాలకు కూడా ఈ సేవలని త్వరలో తీసుకు రావాలని చూస్తున్నారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ సేవలు పొందేందుకు ఇప్పుడు వెసులుబాటు ఉంది. ఇక ఎలా ఈ సేవలని పొందచ్చనేది చూసేద్దాం.

దీని కోసం మొదట మీరు ఉబర్ అఫీషియల్ నంబర్ +91 7292000002 ను మీ ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్ లో సేవ్ చేసుకోండి.
చాట్స్‌లోకి వెళ్లి ఉబర్ చాట్‌బాట్‌తో మీరు చాట్ చేసేయచ్చు.
కావాలంటే మీరు http://wa.me/917292000002 లోకి వెళ్లి చాట్ చెయ్యచ్చు.
ఆ చాట్‌లో Hi అని పంపండి.
పికప్ అడ్రస్, డెస్టినేషన్ పాయింట్స్‌ను చెప్పండి.
పిక్‌అప్ కోసం లైవ్ లొకేషన్‌ను కూడా షేర్ చేయొచ్చు.
రైడ్ ఫేర్ ఎంత, ఎంత టైం లో వస్తుంది అనేది చూడచ్చు.
రైడ్‌ను కన్ఫర్మ్ చేసి రైడ్‌ను యాక్సెప్ట్ చెయ్యాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news