ఓటుకు కోట్లు కేసులో A-3 గా ఉన్న ఉదయ్ సింహ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఏసీబి కోర్టుకు హాజరు కాకపోవడం పై ఏసీబీ కోర్ట్ ఉదయ్ సింహ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది, ఎట్టకేలకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను అమలు చేసిన ఏసీబీ ఆయన్ని అరెస్ట్ చేసింది. ఈ కేసులో నిందితులుగా రేవంత్ , ఉదయసంహ, సెబాస్టియన్, సండ్ర వెంకట వీరయ్యలు ఉన్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన ఉదయసింహను న్యాయమూర్తి ఇంట్లో హాజరు పరిచారు.
ఈనెల 22 వరకు రిమాండ్ విదించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యపై విచారణ ప్రక్రియ ట్రైల్స్ ప్రారంభించిన ఏసీబీ కోర్టు, సండ్రపై అవినీతి నిరోధక చట్టంలోని 12, ఐపీసీ 120బి రెడ్ విత్ 34 సెక్షన్లతో అభియోగాలు నమోదు అయ్యాయి. అభియోగాలను సండ్ర వెంకట వీరయ్యకు చదివి వివరించిన న్యాయస్థానం అయితే సండ్ర వెంకటవీరయ్య అభియోగాలను తోసిపుచ్చారు. కోర్టుకు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ హాజరవగా గైర్హాజరైన ఉదయ్ సింహాపై నిన్న నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయడంతో ఆయన్ను అరెస్ట్ చేసారు.