డిసెంబర్‌ 17 గురువారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 

మార్గశీరమాసండిసెంబర్‌– 17- గురువారం.

మేషరాశి:అదృష్టం కలిసి వస్తుంది !

ఈరోజు ఆఫీస్‌లో పై అధికారి ద్వారా ఇబ్బందులు. శ్రద్ధ పెట్టి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. అనవసర వివాదాలకు తావివ్వకండి. కోపాన్ని వీలైనంత వరకు నియంత్రించండి. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈరోజు కొత్త స్నేహితుల ద్వారా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు ప్రయాణ సూచన. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీసూక్తం పారాయణం చేయండి.

todays horoscope

వృషభరాశి:ఈరోజు అనుకోని ప్రయోజనాలు !

ఈరోజు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు కార్యాలయాలలో ఇబ్బందులు. వ్యాపారులకు పెద్దగా ప్రయోజనం లేని రోజు.  ఉద్యోగులు తోటి ఉద్యోగుల ద్వారా సమస్యలు రావచ్చు. ఈరోజు భవిష్యత్‌ ప్రణాళికపై శ్రద్ధ వహిస్తారు. ఈరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు అనుకోని ప్రయోజనాలు ఉంటాయి. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః  శుభసూచకమైన ఫలితాల కోసం శ్రీదుర్గాదేవి దగ్గర ఆరాధన చేయండి.

 

మిథునరాశి:ఈరోజు ఆనందంగా గడుపుతారు !

ఈరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.ఈరాశి వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం మంచి లాభం అందుకుంటారు. వైవాహికంగా సాధారణంగా ఉంటుంది. ఈరోజు పిల్లల ద్వారా సంతోషకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. ఈరోజు ఆఫీస్‌లో కొన్ని ఉద్యోగ సంబంధిత సమస్యలు పరిష్కరించుకుంటారు.

పరిహారాలుః అనుకూల ఫలితాల కోసం శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

 

కర్కాటక రాశి:ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈరోజు సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా బాగుంటుంది. కానీ అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. మీరు శ్రమించి పనిచేయడం వల్ల ఆఫీస్‌లో అనుకోని ప్రయోజనాలు కలుగుతాయి. భవిష్యత్తులో మిమ్మల్ని విజయం వరిస్తుంది.  చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించ గలుగుతారు.

పరిహారాలుః శుభ ఫలితాల కోసం శ్రీసూక్తపారాయణం చేయండి.

 

సింహ రాశి:సామాజిక బాధ్యత పెరుగుతుంది !

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు ఈరోజు విజయాలు అందుకుంటారు. వృత్తివ్యాపారాల్లో పెద్దల సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అనవసరమైన ఇబ్బందులు. ఈరోజు జాగ్రత్తగా ఆర్థిక లావాదేవీలు జరపండి. వివాదాలు, తగాదలకు దూరంగా ఉండండి.

పరిహారాలుః శివారాధన చేయండి. అనుకూల ఫలితాలు వస్తాయి.

 

కన్య రాశి:ఈరోజు సమస్యలు పరిష్కారం !

ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం పెరుగుతుంది. ఆఫీస్‌లో ఆనందంగా ఉంటుంది. పై అధికారులతో సత్సంబంధాలు. కోపాన్ని నియంత్రించండి. ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. వీటితోపాటు ఆకస్మిక ప్రయోజనాలు అందుకుంటారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీగణపతికి పేలాలు, బెల్లం నైవేద్యం సమర్పించండి.

 

తుల రాశి:ఈరోజు సరదాగా గడుపుతారు !

ఈరోజు సంతోషంగా ఉంటారు. మీరు చేసే వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. సమస్యల వల్ల మానసిక  ప్రశాంతత లోపిస్తుంది. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీదుర్గాదేవి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి.

వృశ్చిక రాశి:ఈరోజు ప్రశంసలు అందుకుంటారు !

ఈరోజు ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు. ఆఫీస్‌లో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు ప్రత్యేకంగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తారు.  పిల్లల వైపు నుంచి శుభవార్త అందుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక మద్దతు లభిస్తుంది. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీగణపతి చెరుకుగడ నైవేద్యం సమర్పిచండి.

 

ధనస్సు రాశి:వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు !

ఈరోజు కొత్త సంబంధాలు, పరిచయాలు ఏర్పడతాయి. మీరు చేస్తున్న పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆఫీస్‌లో చక్కగా ఉంటుంది. దీనివల్ల మీకు సంతోషం, మానసిక ప్రశాంతత కలుగుతుంది. పెండింగ్‌ ఏరియల్స్‌ లేదా బాకీలు వసూలు అవుతాయి. కుటుంబ సభ్యుల గురించి పట్టించుకోవాల్సిన సమయం ఇది.

పరిహారాలుః శ్రీదుర్గాసూక్తం పారాయణం చేయండి.

 

మకర రాశి:ఇంటికి అనుకోని అతిథుల రాక !

ఈరాశి వారికి ఈ రోజు అనుకూల, ప్రతికూల ఫలితాల సమ్మిళితంగా ఉంటుంది. ఆఫీస్‌లో ఉన్నతాధికారులతో విభేధాలు ఉండవచ్చు. వివాహ జీవితంలో సంతోషం పెరుగుతుంది. తెలియని శత్రువుల ద్వారా ఇబ్బందులు పడుతారు. ఇంటికి అనుకోని అతిథుల రాక , దీనివల్ల ఖర్చు పెరుగుతుంది. వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీసూక్తపారాయణం చేయండి,

 

కుంభ రాశి:ఈరోజు శుభప్రదంగా ఉంటుంది !

ఈ రోజు ఆనందంగా ఉంటారు. మీకు ఇది శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. మీరు వాహనాలు, భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు చేపట్టిన పనులు, ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

 

మీన రాశి:ఈరోజు పిల్లలకు సంబంధించిన సమస్యలు !

ఈ రోజు ఈరాశి వారికి అనుకోని ప్రయోజనం ఉంటుంది. గ్రహచలనం వల్ల మీ పిల్లలకు సంబంధించిన సమస్యలను ఎదురుకుంటారు. దీనికోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తారు. ఈరోజు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః శ్రీదుర్గాసూక్తం పారాయణం చేయండి.

 

  • శ్రీ

 

Read more RELATED
Recommended to you

Latest news