రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఉద్దవ్ ఠాక్రే వార్నింగ్

-

మోదీ అనే పేరు ఉన్న వారిని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ అవమానించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గుజరాత్ లోని ఓ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాహుల్ గాంధీని లోక్సభ నుంచి ఎంపీగా అనర్హుడిగా ప్రకటించడం, ఆ తర్వాత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయోనాడ్ లోక్సభ స్థానాన్ని ఖాళీగా చూపించడం చకచగా జరిగిపోయాయి.

ఈ క్రమంలోనే అనర్హత వేటి పడిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్ లో తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పబోనని అన్నారు. తన పేరు సావర్కర్ కాదని.. తాను గాంధీనని, ఆ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని అన్నారు.

అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రె. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేతులు కలిపాము కానీ మా దేవుడు (సావర్కర్) ని అవమానిస్తే ప్రతిపక్ష కూటమి చీలిపోయే అవకాశం ఉందన్నారు. మిమ్మల్ని బిజెపి రెచ్చగొడుతుందని.. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండకపోతే మన దేశం పూర్తిగా నియంత పాలనలోకి వెళ్లిపోవడం ఖాయం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news