గుడ్ న్యూస్: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నేటి నుండి దరఖాస్తులు… ఖాళీలు ఎన్నంటే ?

-

అర్హత ఉండి ఖాళీగా ఉన్న యువతీ యువకులకు సువర్ణావకాశం అని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలలో కానిస్టేబుల్ కావాలి అనుకునే వారికి ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. CRPF లో టెక్నికల్ మరియు ట్రేడ్స్ మ్యాన్ లో కానిస్టేబుల్ పోస్ట్ లకు ఈ రోజు నుండి దరఖాస్తులను చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ఈ రోజు నుండి ఏప్రిల్ 25 వరకు ఉండనుంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 428 పోస్ట్ లు మరియు తెలంగాణ రాష్ట్రంలో 307 పోస్ట్ లు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్ కు గాను ఏ అర్హత మీకు ఉండాలో తెలియాలంటే అధికారిక సైట్ https://crpf.gov.in లోకి వెళ్లి చెక్ చేయగలరు. తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అభ్యర్ధికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇక ఉతీర్ణత చూస్తే టెన్త్, ఇంటర్ మరియు ఐటిఐ లు చదివి ఉండాలి. ఆయా పోస్ట్ ను బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ సమాచారాన్ని మీకు తెలిసిన వారికి కూడా పంపి సహాయపడండి.

Read more RELATED
Recommended to you

Latest news