యూకే ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన ఇండియా.

-

భారత్ సందర్శించాలనుకుంటున్న యూకే పౌరులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియాకు వచ్చే యూకే ప్రయాణికులపై క్వారంటైన్ ఆంక్షలను ఎత్తేసింది. గతంలో యూకే కూడా ఇండియన్ ప్రయాణికులకు ఇటువంటి తిక్క నిబంధనలు విధించింది. గతంలో కోవిషీల్డ్ యూకే ప్రభుత్వం గుర్తించకపోవడం, యూకే వెళ్లిన ప్రయాణికులపై 10 రోజుల కఠిన క్వారంటైన్ నిబంధనలపై భారత ప్రభుత్వం సీరియస్ అయింది.దీనికి ప్రతిగా ఇండియా కూడా యూకేపై ఇటాంటి ఆంక్షలనే విధించింది. దీంతో రెండు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. వివిధ దశల్లో చర్చల అనంతరం రెండు దేశాల మధ్య కరోన ఆంక్షల ఎత్తివేతపై అవగాహన కుదిరింది. దీంతో యూకే వెళ్లే భారతీయులు ప్రయాణానికి ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని, యూకే చేరిన తర్వాత కోవిడ్ టెస్ట్ చేయించుకుంటే సరిపోతుందని తెలిపింది అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇండియా నుంచి చదువుల నిమిత్తం యూకే వెళ్లే విద్యార్థులకు ఇబ్బందులు తప్పనున్నాయి. ఇదే విధంగా యూకే నుంచి వచ్చే ఆదేశ పౌరులపై కూడా కోవిడ్ నిబంధనలు తప్పనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news