యూకేలో ఓమిక్రాన్ విజృంభణ.. ఇప్పటి వరకు 12 మంది మృతి..

-

యూకేలో ఓమిక్రాన్ కల్లోలం కలిగిస్తోంది. ఆ దేశంలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో అధిక కేసులతో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. ఆదేశంలో ఇప్పటి వరకు 37 వేలకు పైగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే 12,133 మందికి కొత్తగా ఓమిక్రాన్ వైరస్ సోకింది. . అయితే  కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ తో ఇప్పటి వరకు యూకేలో 12 మంది మరణించారు. దీనిని అధికారికంగా ఆదేశ ఉప ప్రధాని ధ్రువీకరించారు. ఓమిక్రాన్ వేరియంట్ తో ఇప్పటి వరకు 104 మంది ఆసుపత్రుల్లో చేరినట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఏ దేశంలో లేని విధంగా ఓమిక్రాన్ కేసులు యూకేను కలవరపెడుతున్నాయి. ఇటీవల ఓ సర్వే ప్రకారం యూకేలో ఎప్రిల్ నాటికి 75 వేలకు పైగా మరణాలు సంభవిస్తాయని అంచానా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే కేసుల సంఖ్య చూస్తే ఇదే నిజమవుతుందని తెలుస్తోంది. ఓమిక్రాన్ వల్ల ప్రపంచంలో యూకేలో తప్పితే మరే దేశంలో కూడా మరణాలు నమోదు కాలేదు. ఓమిక్రాన్ తొలి మరణం కూడా యూకేలోనే నమోదైంది. రానున్న కాలంలో ఆ దేశంలో మరింతగా కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news