కరోనా వైరస్ ను ఆమోదించిన తొలి దేశంగా నిలిచిన బ్రిటన్, వచ్చే వారమే మార్కెట్ లో…!

-

ఫైజర్- బయోఎంటెక్ సంయుక్తంగా తయారు చేస్తున్న కరోనావైరస్ వ్యాక్సిన్‌ ను వినియోగం కోసం ఆమోదించిన ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా యునైటెడ్ కింగ్‌డమ్ నిలిచింది. వచ్చే వారం ప్రారంభం నుండి దీనిని విడుదల చేయనున్నట్లు ప్రకటన చేసారు. ” ఫైజర్-బయోఎంటెక్ యొక్క కోవిడ్ -19 వ్యాక్సిన్‌ ను వినియోగం కోసం ఆమోదించడానికి ఇండిపెండెంట్ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ( ఎంహెచ్‌ఆర్‌ఎ ) నుండి వచ్చిన సిఫారసును ప్రభుత్వం ఈ రోజు ఆమోదించింది” అని యుకె ప్రభుత్వం పేర్కొంది.

“ఈ టీకా వచ్చే వారం నుండి యుకె అంతటా అందుబాటులోకి వస్తుంది” అని యుకె ప్రభుత్వం తెలిపింది. కేర్ హోమ్ లో ఉండే వాళ్ళు, ఆరోగ్య మరియు సంరక్షణ సిబ్బంది, వృద్ధులు మరియు వైద్యపరంగా చాలా ఇబ్బందులు ఉన్న వ్యక్తులకు దీనిని అందిస్తారు. వచ్చే వారం దీనిని విక్రయిస్తామని, ఆస్పత్రులు దీనిని తీసుకోవడానికి రెడీగా ఉన్నాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news