కంటి గుడ్డు సైజును పెంచడం సాధ్యమేనా..? ఆయన చేస్తున్నాడుగా..!

-

మనకు తెలియనది ఏదైనా వింతగానే ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకోవటంలో భాగంగా.. భాగంగా.. డైలీ ఎన్నో క్రేజీ ఫ్యాక్ట్స్ చూస్తున్నాం.. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకూ కంటి సైజు పెరగదని అందరూ అంటారు. కానీ ఒక వ్యక్తి మాత్రం కంటి గుడ్డు సైజును పెంచడం, తగ్గించడం చేస్తాడట. ఎండగా ఉంటే చిరాకుగా అనిపిస్తుంది. సాధారణంగా నైట్ మూడ్ రొమాంటిక్ గా ఉంటుంది అనుకుంటారు.. కానీ ఓ అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే.. సూర్యకిరణాల వల్ల లైంగిక కోరికలు పెరుగుతాయట. ఇంకా ఇలాంటి విషయాలు మీకోసం..
కొత్తగా పుట్టిన బిడ్డలో 78 శాతం నీరు ఉంటుంది. సాధారణంగా మనిషిలో 60 శాతం మాత్రమే నీరు ఉంటుంది
గుర్రాలు 4 కాళ్లతో ఒకేసారి స్వారీ (gallop) చేసినట్లుగా… మొసళ్లు కూడా చెయ్యగలవు. ఇవి గంటకు 17 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయట.
తులిప్ పూలు.. 1620 కాలంలో బంగారం కంటే విలువైనవి. అప్పట్లో ఒక్క పువ్వు విలువ ఓ ఇంటి విలువతో సమానంగా ఉండేదట.
కొన్ని నక్షత్రాలు… తమ చుట్టూ తిరిగే గ్రహాలను మింగేస్తాయి. అలాంటివి 25 శాతం దాకా ఉన్నాయి.
మన కంటిలోని గుడ్డు (pupil) సైజును పెంచడం, తగ్గించడం మనవల్ల కాదు. అలా భూమిపై ఒక వ్యక్తి మాత్రం చెయ్యగలుగుతున్నాడట. ఆ వివరాల్ని 2021లో సైకోఫిజియోలజీ ఇంటర్నేషనల్ జర్నల్‌లో తెలిపారు. ఆసక్తి ఉంటే చదివేయండి.!
మంచంపై పరుపుల్లో దాక్కునే నల్లులు (Bed bugs) ఇప్పటివి కావు. డైనోసార్ల కాలం నుంచి ఉన్నాయట. అవి 11.5 కోట్ల సంవత్సరాల నుంచి భూమిపై ఉన్నాయి. వామ్మో చాలా పెద్ద విషయమే ఇది.!
ఆఫ్రికాలో పిరమిడ్లను నిర్మించే సమయానికి మమ్మోత్ ఏనుగులు (Woolly mammoths) బతికే ఉన్నాయి. ఆ తర్వాత అంతరించిపోయాయి.
ఇంటర్నెట్‌ని కాపాడేందుకు 14 మంది సీక్రెట్ సెక్యూరిటీ నిపుణులు పనిచేస్తున్నారనీ… వాళ్లు ప్రతి 3 నెలలకోసారి కలిసి… సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకుంటారని ది గార్డియన్ రిపోర్ట్ చేసింది. ఇంట్రస్టింగ్ కదా..!
మనం నిద్రపోయేటప్పుడు ఉండే పొజిషన్‌ని బట్టీ మన వ్యక్తిత్వం ఉంటుందట. ముడుచుకొని పడుకునేవారు (fetal position) చూడటానికి కఠినమైనవారిలా కనిపిస్తారు. నిజానికి వాళ్లు చాలా సౌమ్యులట.
అబ్రహం లింకన్ రాజకీయ నేత కాక ముందు రెజ్లర్ (wrestler). మొత్తం 300 మ్యాచ్‌లు ఆడి.. ఒక్కటే ఓడిపోయాడు. 6 అడుగుల 4 అంగుళాలు ఉండటం వల్ల ఆయన ఈజీగా గెలిచేవాడట.
సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు మగాళ్లలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెంచుతాయి. సూర్య కాంతి వల్ల అందరిలోనూ లైంగిక కోరికలు పెరుగుతాయని అధ్యయనంలో తేలిందండోయ్.
భూమిపై ఏటా 1.6 కోట్ల దాకా పిడుగులు పడుతున్నాయి. అంటే నిరంతరం 2వేల దాకా పిడుగులు పడుతున్నట్లే.
శనిగ్రహం లోపల గజిబిజిగా ఉందని తేలింది. కేంద్రం (core)లో బురద ఉంది. హైడ్రోజన్, హీలియం గ్యాస్, ఐస్ కలిసి ఉన్నాయి. గ్రహం లోపలికి వెళ్లే కొద్దీ ఉప్పు ఎక్కువవుతుందట.

Read more RELATED
Recommended to you

Latest news