స్పైస్‌జెట్‌పై సైబర్ దాడి.. ఆగిపోయిన విమానాలు..!!

-

స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌ పై సైబర్ దాడి జరిగింది. రాన్సమ్‌వేర్ వైరస్ దాడి వల్ల విమానాలు స్తంభించిపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. రాన్సమ్‌వేర్ వైరస్ దాడి వల్ల ఈ రోజు ఉదయం నుంచి విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తిందని, దీంతో విమానాల రాకపోకలు తగ్గాయని అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని స్పైస్‌జెట్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

స్పైస్‌జెట్
స్పైస్‌జెట్

స్పైస్‌జెట్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ విధంగా పేర్కొంది. స్పైస్‌జెట్ సిస్టమ్‌పై గత రాత్రి రాన్సమ్‌వేర్ వైరస్‌తో దాడి చేసినట్లు తెలిపారు. దీంతో ప్రయాణికులపై ఈ ప్రభావం పడిందన్నారు. విమానాల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. సమస్యను పరిష్కరించడానికి ఐటీ బృందం ప్రయత్నిస్తోందని, త్వరలో విమానాలు సాధారణ స్థితిలోకి వస్తాయన్నారు. మరోవైపు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు దిగారు. సిస్టమ్ సర్వర్ డౌన్ సమస్య తలెత్తిందని తెలిపారు. అయితే ఈ సందర్భంగా సౌరభ్ గోయల్ అనే ప్రయాణికుడు ట్విట్టర్ ద్వారా తన గోడును తెలిపాడు. ఉదయం బయలుదేరాల్సిన విమానం.. ఇప్పటికీ కదలేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news