ఉక్రెయిన్ కాల్పుల్లో గాయపడ్డ హర్జోత్ సింగ్ … నేడు స్వదేశానికి రాక

-

ఉక్రెయిన్ లో భారత విద్యార్థుల తరలింపు దాదాపుగా తుది అంకానికి చేరుకుంది. ఆపరేషన్ గంగ ద్వారా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలు అయిన రొమేనియా, పోలాండ్, హంగేరీ, స్లోవేకియా నుంచి ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 16 వేలకుపైగా భారత విద్యార్థులు ఇండియాకు చేరుకున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల కీవ్ నగరంలో  జరిగిన కాల్పుల్లో భారతీయుడు హర్జోత్ సింగ్ తీవ్ర బుల్లెట్ గాయాలపాలయ్యాడు. ఓ కారులో సరిహద్దులు దాటే ప్రయత్నంలో అతని కారుపై కాల్పులు జరిగాయి. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కీవ్ నగరంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న హర్జోత్ సింగ్ ఇండియాకు రానున్నారు.

ఈ విషయాన్ని నిన్ననే కేంద్ర మంత్రి వీకే సింగ్ తెలిపారు. దాడి సమయంలో హర్జోత్ సింగ్ తన పాస్ పోర్ట్ ను కూడా కోల్పోయాడు. తాజాగా ఈరోజు హర్జోత్ సింగ్ ను ఉక్రెయిన్ నుంచి సరిహద్దు దాటించి పోలాండ్ కు చేర్చారు. పోలాండ్ రెడ్ క్రాస్ అంబులెన్స్ సహాయంతో.. బార్డర్ దాటించామని ఇండియన్ వరల్డ్ ఫోరమ్ ప్రెసిడెంట్ పునీత్ సింగ్ చంధోక్ తెలిపారు. హర్జోత్ సింగ్ వెంట భారత దౌత్య అధికారులు కూడా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news