బీజేపీ పార్టీలో ఈటల రాజేందర్ మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఎమ్యెల్యే గెలిచిన తర్వాత మొదటి సారిగా అసెంబ్లీ లో అడుగు పెడుతున్నారు. అంటే సీఎం కేసీఆర్, ఈటల ఇవాళ అసెంబ్లీలో ఎదురుపడనున్నారన్న మాట. అయితే.. హుజురాబాద్ ఎన్నికల తరువాత మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న ఈటల రాజేందర్ పై ఆంక్షలు విధించింది ప్రభుత్వం.
అనేక నిర్బంధాలు, ప్రలోభాలకు సైతం ఎదుర్కొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన హుజురాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున ఈటలకు తోడుగా ఉండి అసెంబ్లీకి పంపించాలి అని అనుకున్నారు. కానీ ఈటల రాజేందర్ తో పాటుగా ఎవరూ వెళ్ళడానికి వీలులేదంటు ఈ మేరకు తమకు ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారని మేడ్చల్ పోలీసులు ఈటల ఇంటికి వచ్చి సమాచారం ఇచ్చారు. దీంతో ఈటల అభిమానులు అగ్రహానికి గురవుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ నియంతృత్వం, పోలీసుల తీరుపై హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, ఈటల రాజేందర్ అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.