ఉక్రెయిన్-ర‌ష్యా వార్ : భార‌త ప్ర‌భుత్వ‌ వైఖ‌రికి విప‌క్ష పార్టీలు మ‌ద్ధ‌తు

-

ఉక్రెయిన్ – ర‌ష్యా మ‌ధ్య యుద్ధం న‌డుస్తున్న విషయం తెలిసిందే. కాగ ఈ యుద్ధం విషయంలో ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ర‌ష్యా ను త‌ప్పు ప‌డుతున్నాయి. అంతే కాకుండా కొన్ని దేశాలు ర‌ష్యాపై క‌ఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. కానీ భార‌త్.. ర‌ష్యా కు మ‌ద్ద‌తుగా నిలుస్తుంది. కొన్ని సంద‌ర్భాల్లో త‌ట‌స్థ వైఖ‌రిని అవ‌లంభిస్తుంది. ఐక్య రాజ్య స‌మ‌తిలో, భ‌ద్ర‌తా మండ‌లిలో ర‌ష్యా పై ఓటింగ్ జ‌రిపిన‌ప్పుడు కూడా భార‌త్ ఓటింగ్ కు దూరంగా ఉంటుంది.

కాగ ఉక్రెయిన్ – ర‌ష్యా మ‌ధ్య చోటు చేసుకుంటున్న వివాదంలో భార‌త్ ప్ర‌భుత్వం వైఖ‌రి ప‌ట్ల దేశంలో ఉన్న విప‌క్ష పార్టీలు మ‌ద్ద‌తు తెలిపాయి. భార‌త ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విదేశి విధానం పై కాంగ్రెస్ పార్టీ తో స‌హా అన్ని విప‌క్ష పార్టీలు.. కేంద్ర ప్ర‌భుత్వానికి ఏక‌ప‌క్షంగా మ‌ద్ద‌తు తెలిపాయి. అయితే గురువారం… అంత‌ర్జాయ వ్య‌వహారాల‌పై విదేశి వ్య‌వ‌హారాల శాఖ అఖిల ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించింది. ఈ వివాదంలో భార‌త్ అనుస‌రిస్తున్న వైఖ‌రిని విదేశి వ్య‌వ‌హారాల శాఖ.. అఖిల ప‌క్ష సమావేశంలో వెల్ల‌డించింది. దీనికి కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలు కేంద్ర ప్ర‌భుత్వానికి మ‌ద్ధ‌తుగా నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news