ఉక్రెయిన్‌లో వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. గొయ్యిలో 440 మృతదేహాలు

-

ఉక్రెయిన్-రష్యాల మధ్య ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకు పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. రష్యా ఎంత తీవ్రంగా దాడులు చేస్తున్నా.. ఏ మాత్రం తగ్గకుండా దీటుగా తిప్పికొడుతోంది ఉక్రెయిన్. ఇటీవలే రష్యా దళాలను వెళ్లగొట్టి ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద ప్రాంతమైన ఖర్కివ్‌ను కీవ్‌ సేనలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.

తమ అధీనంలోకి వచ్చిన ఆ ప్రాంతాన్ని తాజాగా అధికారులు పరిశీలించగా ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు వెలుగుచూస్తున్నాయి. ఈ నగరంలోని ఇజియం ప్రాంతంలో శవాల దిబ్బలు క్రెమ్లిన్‌ అరాచకానికి అద్దం పడుతున్నాయి. ఒక చోట గొయ్యిలో వందల కొద్దీ మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇజియం శివారు అటవీ ప్రాంతంలోని ఓ గొయ్యిలో 440కి పైగా మృతదేహాలు ఉన్నట్లు తూర్పు ఖర్కివ్‌ ప్రాంతంలోని సీనియర్ దర్యాప్తు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

వీరిలో కొందరు తుపాకీ గాయాలతో చనిపోగా.. మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారని ఆయన పేర్కొన్నారు. వీరిలో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. కొన్ని మృతదేహాలపై తీవ్రంగా హింసించిన గుర్తులు ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version