రష్యన్ ఆర్మీ దారుణాలు… చివరకు పురుషులను, బాలురులను కూడా వదలడం లేదు

-

ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ ప్రారంభమై రెండు నెలలు దాటింది. అయినా ఉక్రెయిన్ రష్యాకు కొరకరాని కొయ్యగా మారింది. బలమైన సైన్యం కలిగిన రష్యా ముందు వారం రోజుల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా భావించినప్పటికీ… అమెరికా, నాటో దేశాలు ఇస్తున్న సైనిక, వ్యూహాత్మక సహకారంతో రష్యాను నిలువరిస్తోంది. ఎంతో పోరాడినా… రష్యాకు రాజధాని కీవ్ దక్కలేదు. దీంతో ఆక్రోశంతో సుమీ, మరియోపోల్, ఖార్కీవ్ వంటి నగరాలపై రాకెట్లతో విరుచుకుపడింది రష్యా ఆర్మీ. ప్రస్తుతం ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం నుంచి దాడులను ఎక్కువ చేస్తోంది రష్యా. 

ఇదిలా ఉంటే ఇలా గ్రామాలను, నగరాలను ధ్వంసం చేయడంతో ఆగిపోలేదు రష్యన్ ఆర్మీ అరాచకాలు. ఉక్రెయిన్ మహిళలపై దారుణంగా అత్యాచారాలకు పాల్పడటం వంటి అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. చివరకు రష్యన్ ఆర్మికీ అందంగా కనిపించకూడదని అక్కడ మహిళలు జట్టు కత్తిరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే మహిళలనే కాదు చివరకు పురుషఉలు, బాలురను కూడా రష్యన్ ఆర్మీ వదలడం లేదు. వారిపై కూడా అత్యాచారాలకు పాల్పడినట్లు ఆధారాలు దొరికాయని ఐరాస ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా ప్యాటెల్ తెలిపింది. 12కు పైగా ఇలాంటి కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. దోషులను అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టేందుకు అత్యాచారాలకు గురైన పురుషులు, బాలురు ముందుకు రావాలని కోరుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news