ట్రోల్ బాజా ట్రోల్ : అంతా చంద్ర‌బాబే చేశాడా ? కేసీఆర్ !

-

పండ‌క్కి ఊరెళ్లి వ‌చ్చాక త‌న క్లోజ్ ఫ్రెండ్ ఆంధ్రాలో ప‌రిస్థితులు బాలేవ‌ని అక్క‌డ నీళ్లు,క‌రెంటు ఉండ‌వ‌ని, రోడ్లు బాలేవ‌ని చెప్పార‌ని మొన్న క్రెడాయ్ మీటింగ్ లో చెప్పారు కేటీఆర్. అప్పుడు చాలా అంటే వివాద‌మే న‌డిచింది. ఆఖ‌రికి అదొక అమాయ‌క‌పు వ్యాఖ్య అని కేటీఆర్ త‌న‌ని తాను దిద్దుకున్నారు. అంతా బాగుంది స‌మ‌స్య ప‌రిష్కారం అయిపోయింది అనుకునేలోగా ఇవాళ అంటే మే నాలుగు, 2022 ఉద‌యం భారీ వ‌ర్షం కురిసి జ‌ల‌మ‌యం అయిన న‌గ‌రం రోడ్ల‌ను ప‌ట్టి చూపాయి. అదేవిధంగా వెయ్యికోట్ల ఆల‌యం ప‌నుల్లో డొల్ల‌త‌నం ఒక‌టి వెలుగు చూసింది. దీంతో వివాదం మ‌రింత పెరిగిపోయింది. ఇప్పుడు కేటీఆర్ ఆంధ్రా రోడ్డు చూపించాలా లేదా తెలంగాణ రోడ్డు చూపించాలా ? అన్న సెటైరిక్ వెర్ష‌న్ ఒక‌టి హ‌ల్చ‌ల్ చేస్తోంది.

 

యాద‌గిరి నార‌సింహ స్వామి మీద ఆన ఇప్పుడేం జ‌రిగినా అక్క‌డేం జ‌రిగినా మాట్లాడితే అవ‌న్నీ రాజ‌కీయాల‌కు అనుగుణంగానే ఉంటాయి. రాజ‌కీయాల‌కు అతీతంగా మాట్లాడ‌డం అన్న‌ది సాధార‌ణంగా జ‌ర‌గ‌ని ప‌ని ! ఆ విధంగా కేసీఆర్ కానీ ఆ విధంగా కేటీఆర్ కానీ ఈ వివాదంకు బాధ్యులు కారు.. కాలేరు.. కాబోరు కూడా ! కారు పార్టీ పెద్ద‌లు అటుగా వెళ్లే అవ‌కాశం ఉంటే ఒక్క‌సారి నాణ్య‌తా లోపాలు ప‌రిశీలించి వ‌స్తే బాగుంటుంది. అయినా మీ ఇల్లు ఇలాంటి లోపాల‌తో నిర్మితం అయితే ఒప్పుకుంటారా? లేదు క‌దా! మ‌రి! వెయ్యి కోట్ల ఆల‌యాన్ని ఎలా అంత‌టి నిర్ల‌క్ష్యంతో నిర్మించారు అంటూ నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు వీటిపై మాట్లాడాల్సింది.. స‌మాధానం చెప్పాల్సింది కేసీఆరే !

కేసీఆర్ ను ఏమీ అన‌వ‌ద్దు. కేటీఆర్ ను కూడా ఏమీ అన‌వద్దు. ఎందుకంటే వాళ్లిద్ద‌రిదీ త‌ప్పులేదు. త‌ప్పంతా వాన‌దేవుడిది మ‌రియు ఇంకా ఇత‌ర దేవుళ్ల‌ది కూడా కావొచ్చు. ఆ ఇత‌ర దేవుళ్ల‌లో ప్ర‌జ‌లు కూడా ఉండ‌వ‌చ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ చెప్పిన విధంగా ప్ర‌జ‌లే దేవుళ్లు క‌నుక ! ఆ విధంగా త‌ప్పు ప్ర‌జ‌ల‌ది కావొచ్చు. కాక‌పోవ‌చ్చు. మంచి ప్ర‌భుత్వాల‌ను ఎన్నుకునే శ‌క్తి ప్ర‌జ‌ల‌దే క‌నుక ఆ విధంగా త‌ప్పు ఎవ‌రు చేశారు.. ప్ర‌జ‌లే క‌దా! అందుక‌ని ఇప్పుడు కేసీఆర్ ను ఏమీ అన‌వ‌ద్దు అని విన్న‌పం. లేదా కేసీఆర్ ను టార్గెట్ చేసినా కూడా కేటీఆర్ కు కోపం మ‌రింత పెరిగిపోవ‌చ్చు. ఇప్పుడు ఏ ఆంధ్రా ఫ్రెండ్ వచ్చి వీటికి స‌మాధానం ఇస్తాడ‌ని నెటిజ‌న్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. వీటిపై ఇప్పుడు కేటీఆర్ సానుకూలంగా ఉంటారో లేదా వీటినొక వివాద సంబంధ విష‌యాలుగా చూసి గొడ‌వ పెద్ద‌ది చేసుకుంటారో అన్న‌ది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news