russia-ukraine war: ఉక్రెయిన్ పై హైపర్ సోనిక్ క్షిపణితో రష్యా దాడి

-

ఉక్రెయిన్ పై రష్యా దాడి  25 రోజులకు చేరింది. అత్యాధునిక ఆయుధాలతో రష్యా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతోంది. ముఖ్యంగా రాజధాని కీవ్ తో పాటు ఖార్కీవ్, మరియోపోల్, ఎల్వీవ్ నగరాలపై క్షిపణులతో దాడులు చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ దళాలు కూడా ప్రతిఘటిస్తుండటంతో రష్యా దాడులను మరింత ఎక్కువగా చేస్తోంది. ఉక్రెయిన్ లోని మొత్తం 8 నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. 

తాజాగా ఉక్రెయిన్ పై రష్యా అత్యాధునిక హైపర్ సోనిక్ క్షిపణిని ప్రయోగించింది. అధునాతమైన కింజాల్ క్షిపణిని  మిగ్ 31కే యద్ధ విమానం ద్వారా ప్రయోగించింది. పశ్చిమ ఇవానో-ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలోని భారీ భూగర్భ ఆయుధాగారంపై దాడి చేసింది. ఈ ఆయుధగారం పూర్తిగా ధ్వంసం అయినట్లు రష్యా ప్రకటించింది. దాడి జరిగే సయయంలో అక్కడ 200 మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి వల్ల చాలా మంది సైనికులు మరణించారు. ఇప్పటి వరకు 50 వరకు సైనికుల డెడ్ బాడీలు బయటపడ్డాయి. మరోవైపు నౌక విధ్వంసక క్షిపణితో ఒడిసాపై దాడి చేసింది. మైక్రోలైవ్ లో ఆయుధాగారంపై దాడి చేసింది రష్యా. రష్యా దాడులపై బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ పటం నుంచి మరియోపోల్ తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news