వైరల్ వీడియో: లావా ఇడ్లీకి ఫిదా అవుతున్న నెటిజన్లు..!

-

సాధారణంగా దక్షిణ భారత దేశంలో అల్పాహారం అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది ఇడ్లీ. ఇడ్లీ ఎక్కువగా మనం తింటూనే ఉంటాము. పైగా ఉదయాన్నే ఇడ్లీలు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. పైగా ఇడ్లీ ఆయిలీగా ఉండదు కాబట్టి చాలా మంది ఉదయాన్నే తినడానికి ప్రిఫర్ చేస్తారు. పైగా సులభంగా అయిపోతుంది.

 

సాంబార్ తో కానీ చట్నీతో కానీ వేడి వేడి ఇడ్లీని సర్వ్ చేసుకుని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాని సాంబార్ తో ఇడ్లీని తినడం మనకు తెలుసు. కానీ సాంబార్ ఇడ్లీ గురించి తెలియదు. అవును మీరు విన్నది కరెక్టే. టాలెంటెడ్ హోమ్ కుక్ లావా ఇడ్లీ తయారు చేయడం జరిగింది. మామూలుగా మనం లావా కేక్ వంటివి వింటాం కానీ ఈ లావా ఇడ్లీ ఏంటి అని ఆలోచిస్తున్నారా..? మరి ఆ లావా ఇడ్లీ గురించి ఇప్పుడు చూద్దాం.

స్వాడ్ కుకింగ్ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని షేర్ చేశారు. ఇడ్లీ కట్ చేయగానే సాంబార్ లోపలి నుంచి బయటికి వస్తుంది. మొదట ఆమె ఇడ్లీ పిండి తీసుకుని ఆ తర్వాత ఒక క్రిస్పీ పూరీని తీసుకుని దాంట్లో కొంచెం సాంబార్ని వేశారు. కొంచెం ఇడ్లీ పిండిని మౌల్డ్ లో వేసి పూరి లో సాంబార్ వేశారు. ఆ తర్వాత ఈమె మొత్తం పిండి తో కవర్ చేశారు.

ఆ తర్వాత ఇడ్లీ ని ఆవిరి మీద పెట్టి ఇడ్లీ తయారు చేశారు. తర్వాత ఆ మౌల్డ్ ని తొలగించి చట్నీతో సర్వ్ చేశారు. ఇడ్లీ ని మనం కట్ చేయగానే లోపలి నుంచి బయటకు సాంబార్ వస్తూ ఉంటుంది. ఇంటర్నెట్ లో ఈ వీడియో సెన్సేషన్ గా మారింది. రెండు వందల ఎనభై నాలుగు వేల మంది ఈ వీడియో చూశారు. 9 వేల మంది లైక్ కొట్టారు. మరి ఈ వైరల్ వీడియో ని మీరు కూడా ఓ లుక్కేయండి.

 

Read more RELATED
Recommended to you

Latest news