ఉక్రెయిన్- రష్యా మధ్య వార్ భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై రష్యా దాడులు చేస్తూనే ఉంది. ఎంతో అందంగా ఉండే కీవ్, ఖార్కీవ్ వంటి నగరాలు బాంబు పేలుళ్లతో కళావిహీనంగా తయారయ్యాయి. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపైన ఆంక్షల మరింత కఠినమవతున్నాయి. అమెరికా తో పాటు జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి యూరోపియన్ దేశాలతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఆంక్షలు విధించాయి. తమ దేశాలపై రష్యా విమానాలను రాకుండా నిషేధం విధించాయి. దీనికి ప్రతిగా రష్యా కూడా 36 దేశాల విమానాలను తమ గగనతలం నుంచి నిషేధించాయి.
ఇదిలా ఉంటే పలు కార్పొరేట్ కంపెనీలు రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఆప్ స్టోర్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు రష్యాలో వారి కార్యకలాపాలను నిలిపివేశాయి. తాజాగా పెప్సీ, కొకాకోలా తమ ఉత్పత్తును రష్యాలో విక్రయించడంపై నిషేధాన్ని విధించుకున్నాయి. ఇటీవల పూమా కంపెనీ కూడా తన ఉత్పత్తులను రష్యాలో విక్రయించడాన్ని నిలిపివేసింది.