రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు…. ఆంక్షలు యుద్ధంతో సమానం అంటూ వార్నింగ్

-

రష్య అధ్యక్షుడు నాటో దేశాలపై సంచల వ్యాఖ్యలు చేశారు. రష్యాపై నిషేధం అంటే యుద్ధంతో సమానం అని అన్నారు. నాటో దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉహించినదాని కన్నా ఎక్కువగా ఉక్రెయిన్ పై భీకరయుద్ధం చేస్తాం అన్నారు. ఉక్రెయిన్ లో అణ్వాయుధాలు లేకుండా చేస్తామని అన్నారు. మా డిమాండ్లు నెరవేరేదాకా యుద్ధం ఆగదని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందని ఆరోపించారు. మరోవైపు రష్యాలో మార్షల్ లా అవసరం లేదని అన్నారు. రష్యన్ వైమానిక దళం మహిళా పైలెట్లతో సమావేశంలో ఈవ్యాఖ్యలు చేశారు.  

ఇదిలా ఉంటే ఇటీవల కూడా పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం యుద్ధమే.. చర్చలు చర్చలే అంటూ తను ఉక్రెయిన్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్న మధ్య రెండు సార్లు జరిగాయి.  ఈరెండు సార్లు రెండు దేశాలు తమతమ డిమాండ్లపై గట్టిగా పట్టుపట్టడంతో అసంపూర్తిగానే ముగిశాయి. మూడోసారి ఈ రెండు దేశాాలు బెలారస్ వేదికగా చర్చలకు సిద్ధం అవుతున్నాయి. రష్యా నాటోలో చేరకూడదని లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతో పాటు తూర్పు వైపు డాన్బాస్ ప్రాంతంపై రష్యా ఆధిక్యతను ఒప్పుకోవడంతో పాటు క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా గుర్తించాలంటూ డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ వెంటనే తమ భూభాగం నుంచి రష్యా దళాలు ఉపసంహరించుకోవాలని.. మా సార్వభౌమాధికారంలో మీ జోక్యం ఏమిటని ప్రశ్నిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news