ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో రష్యా ఎప్పుడూ చూడని ప్రాణ నష్టం చవిచూస్తుందని భారత్ లోని ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోర్ పొలిఖా అన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థ ప్రతీరోజూ కుంటుపడుతుందని ఆయన అన్నారు. రష్యా పూర్తిగా ప్రాణనష్టాన్ని చవిచూస్తుంది అని ఆయన అన్నారు. సుమారు 5,300 మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. ఈ సమయంలో ఉక్రెయిన్ లో కూడా చాలా మంది ప్రాణ నష్టానికి గురవుతున్నారని ఆయన అన్నారు. బాంబు దాడులు, షెల్లింగ్ కారణంగా.. ఇప్పటికే 16 మంది పిల్లలు మరణించారని ఆయన అన్నారు.
యుద్ధాన్ని ఆపడానికి రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ పై ఒత్తడి తీసుకురావాలని మేము మా విదేశీ భాగస్వాములందరిని కోరుతున్నామని పోలిఖా అన్నారు. ఈరోజు రష్యా- ఉక్రెయిన్ మధ్య చర్చల కోసం మా ప్రతినిధి బృందం మొదటి రౌండ్ శాంతి చర్చలు నిర్వహించడానికి వెళ్ళిందని.. శాంతి చర్చల సమయంలో కూడా షెల్లింగ్, బాంబు దాడులు జరిగాయని పోలిఖా వెల్లడించారు.