హీరో శివ కార్తికేయ‌న్ సినిమాలో ఉక్రెయిన్ బ్యూటీ

-

త‌మిళ స్టార్ హీరో శివ కార్తికేయ‌న్ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. జాతి రత్నాలు సినిమాతో ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకున్న డైరెక్ట‌ర్ కేవీ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో శివ కార్తికేయ‌న్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను నారాయ‌ణ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహ‌న్ రావు, సురేశ్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగ‌ ఈ సినిమా తెలుగు తో పాటు త‌మిళంలో కూడా ఒకే సారి నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా జ‌రుపుకుంటుంది.

కాగ ఈ సినిమాను డైరెక్ట‌ర్ కేవీ అనుదీప్.. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా కూడా జాతి ర‌త్నాలు సినిమా లాగే.. వినోద‌భ‌రితంగా ఉంటుంద‌ని తెలుస్తుంది. కాగ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా విదేశీ భామను తీసుకున్నారు. ప్ర‌స్తుతం యుద్ధంతో వ‌ణికిపోతున్న ఉక్రెయిన్ దేశానికి చెందిన న‌టి మ‌రియా ర్యాబోషప్క ను ఈ సినిమాలో హీరోయిన్ గా చిత్ర బృందం ఎంపిక చేసింది.

కాగ ఈ ఉక్రెయిన్ న‌టి మ‌రియా ర్యాబోషప్క.. ఇప్పట‌కే ఒక హింది వెబ్ సీరిస్ లో న‌టించింది. హాట్ స్టార్ నిర్మించిన స్పెషల్ ఆప్స్ 1.5 అనే వెబ్ సీరిస్ లో ఉక్రెయిన్ న‌టి మ‌రియా ర్యాబోషప్క కీల‌క పాత్ర‌లో న‌టించింది.

Read more RELATED
Recommended to you

Latest news