రష్యా- ఉక్రెయిన్ వార్: 3500 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టామంటున్న ఉక్రెయిన్

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్దం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. మూడో రోజు యుద్ధం ఉక్రెయిన్ రాజధానిని స్వాధీనం చేసుకనే దిశగా సాగుతోంది. రష్యన్ ఆర్మీ.. ఉక్రెయిన్ అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్ బలగాలు కూడా ప్రతిఘటిస్తున్నాయి. 

రష్యాతో మూడో రోజు చేరిన యుద్ధంలో ఉక్రెయిన్ బలగాలు 3500 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. 14 రష్యా విమానాలు, 102 ట్యాంకర్లు, 8 హెలికాప్టర్లు, 536 సాయుధ బలగాలు, 15 ఆర్టిలరీ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ విషయాన్ని రష్యా ధ్రువీకరించలేదు. మరోవైపు కీవ్ నగరంపై మిసైళ్లతో విరుచుకుపడుతోంది రష్యన్ ఆర్మీ. రాజధాని కీవ్ లోని పలు రెసిడెన్షియల్ బిల్డింగ్ లపై దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ..తాను ప్రాణం ఉన్నంత వరకు ఉక్రెయిన్ ని విడిచివెళ్లనని అన్నారు. ప్రజలు దేశాన్ని రక్షించుకునేందుకు తుపాకులను వీడద్దని పిలుపునిచ్చారు. అమెరికా రావాల్సిందిగా కోరిన జోబైడెన్ ఆహ్వానాన్ని తిరస్కరించాడు జెలన్ స్కీ. తాను తన కుటుంబం ఉక్రెయిన్ కీవ్ లోనే ఉంటాం అంటూ సెల్ఫీ వీడియోను ట్విట్టర్ లో పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news