శ్రీలంక మ్యాచ్‌లో హైడ్రామా.. క్రీడా స్పూర్తిని చాటుకున్న రోహిత్ శర్మ

-

గౌహతి వేదికగా మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు 67 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియా 1-0 ఆదిక్యంలో నిలిచింది.

అయితే, ఈ మ్యాచ్‌ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో మన్కడింగ్ రనౌట్’ కు భారత పెసర్ మహమ్మద్ షమీ ప్రయత్నించగా, రోహిత్ శర్మ నిరాకరించాడు.

షమీ చేత అప్పీల్ ను వెనక్కు తీసుకునేలా చేసి అందరి మనసులను గెలుచుకున్నాడు. ఆ సమయంలో శ్రీలంక కెప్టెన్ డసన్ శనక 98 పరుగులతో నాన్ స్ట్రైకర్ గా ఉండటంతో రోహిత్, మన్కడింగ్ నిరాకరించాడు. శ్రీలంక ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో ఈ హై డ్రామా చోటు చేసుకోగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news