Un stoppable: అన్ స్టాపబుల్ పవన్ ఎపిసోడ్ ఎప్పుడంటే..?

-

నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలతో పాటు ఆహ వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. దీంతో ఆయన క్రేజ్ పూర్తిస్థాయిలో పెరిగిపోయిందని చెప్పాలి. ఇటీవలే బాహుబలి ప్రభాస్ తో కూడా ఇంటర్వ్యూ నిర్వహించగా.. పార్ట్ వన్ విడుదలైన రోజునే ఆహా సర్వర్లు కూడా డౌన్ అయ్యాయి.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం అభిమానులు చాలా ఎదురు చూస్తున్నారు. అన్ స్టాపబుల్ పవర్ స్టార్ ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పటికే ప్రోమో విడుదలవగా.. బాలయ్య ఆసక్తికర ప్రశ్నలను వేయగా.. పవన్ కళ్యాణ్ కూడా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చినట్లు ప్రోమో ద్వారా అర్థమవుతుంది.

ఇకపోతే బాలయ్య పవన్ కళ్యాణ్ షో విడుదల తేదీ ఖరారు అయ్యింది. అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతుండగా.. రెండు ఎపిసోడ్లుగా విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి రెండో తేదీన పార్ట్ 1 రానుంది.. ఆ తర్వాత వారం రోజులకు పార్టు 2 విడుదల కానుంది. ఈ మేరకు ఆహా అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉండగా ఒకవైపు పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ ఇద్దరూ కూడా రాజకీయాలలో కొనసాగుతుండడంతో ఈ విషయంపై ఆసక్తి నెలకొంది. ఇద్దరూ వైసీపీ ప్రత్యర్థులు గా ఉన్నారు. మరి ఎలాంటి ప్రశ్నలు రానున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సినిమాలు, రాజకీయాలు మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి , మూడు పెళ్లిళ్ల విమర్శల గురించి కూడా బాలకృష్ణ అడగబోతున్నట్లు.. వీటికి పవన్ కళ్యాణ్ సమాధానం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అన్ స్టాపబుల్ సీజన్ 2 కి పవన్ ఎపిసోడ్ తో శుభం కార్డు పడనుందని వార్తలు వినిపిస్తున్నాయిత్వరలోనే మళ్లీ సీజన్ 3 కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news