ఆయుష్ మినిస్ట్రీ యునాని ఔషధం కరోనా సమయంలో తీసుకుంటే మంచిది…!

కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తోంది. దీనితో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. మినిష్టర్ ఆఫ్ ఆయుష్ తాజాగా ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ ని విడుదల చేశారు. యునాని ఔషధం ద్వారా కరోనా దరి చేరకుండా ఉండడానికి సహాయ పడుతుందని చెప్పడం జరిగింది.

సోషల్ డిస్టెన్స్ ని పాటించండి, ఫేస్ మాస్క్ ధరించండి. పదేపదే చేతుల్ని శానిటైజర్ లేదా సబ్బు తో శుభ్రంగా ఉంచుకోండి. తుమ్మినప్పుడు దగ్గినప్పుడు టిష్యూ పేపర్ అడ్డు పెట్టుకోండి. ఆ తర్వాత దానిని డస్ట్ బిన్ లో వేసేయండి. అది కూడా ఈ డాక్యుమెంట్ లో ఉంది.

అనారోగ్యం తో బాధపడే వాళ్ళని ముట్టుకోకుండా ఉండడం, ముఖ్యంగా ఫ్లూ వంటి సమస్యలతో బాధ పడే వాళ్ల దగ్గరికి వెళ్లకుండా ఉండటం మంచిది. జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలకి వెళ్లకపోవడం ఎంతో మంచిదని ఇందులో ఉంది. కోవిడ్ పాజిటివ్ వుండే వాళ్ళ వస్తువుల్ని, బట్టల్ని ముట్టుకోకూడదు.

ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఈ విధంగా అనుసరించండి:

ఖమీరా మార్వేర్డ్ 5 గ్రాములు తీసుకోండి లేదా తిరియాకే అర్బా 3-5 గ్రాములు తీసుకోండి (మధుమేహ వ్యాధిగ్రస్తులు నివారించవచ్చు).
రాయ్హాన్ / తులసి (ఓసిమమ్) ఆకులు 4 భాగాలు, దార్ చిని / సిన్నమోన్ (సిన్నమోమమ్ జైలానికం) బెరడు 2 భాగాలు, జంజీబీల్ / అడ్రాక్ (జింగిబర్ అఫిసినల్) రైజోమ్ 2 భాగాలు 250 మి.లీ నీటిలో వేసి సగానికి తగ్గే వరకు మరిగించాలి.

రుచి కోసం కషాయంలో బెల్లం లేదా నిమ్మరసం వేసి తీసుకోండి. బెహిడానా (సిడోనియా ఆబ్లోంగా) 3 గ్రాములు, ఉన్నాబ్ (జిజిఫస్ జుజుబే) 5 ను కాషాయం లో వేసి తీసుకోండి. నీటిలో సపిస్తాన్ (కార్డియా మైక్సా) 9. ఈ కషాయాలను రోజుకు రెండు సార్లు 14 రోజులు తీసుకోవచ్చు.