ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేల సీఎం జగన్ మోహన్ రెడ్డి కి మాజీ ఎంపీ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక లేఖ రాశారు. కోవిడ్ రోగులకు తాత్కాలిక సహాయ కేంద్రాలు నడిపేందుకు అన్ని ఫంక్షన్ హాళ్లు స్వాధీనం చేసుకుని వాటిని ఎన్జీఓలు, ట్రస్ట్ లకు అప్పగించాలని అందులో పేర్కొన్నారు. ఆ ఫంక్షన్ హాల్స్ ఖర్చులను ఎన్జీవోలు, ట్రస్టులు భరిస్తాయని, ప్రభుత్వం నుంచి వైద్యులు, వైద్య సిబ్బందిని కేటాయిస్తే సరిపోతుందన్నారు.
అలాగే రాజమండ్రిలో జైన్ సంఘం ఇప్పటికే అద్దెకు ఒక కళ్యాణ మండపం తీసుకొని 60 పడకలతో కరోనా సెంటర్‌ను నడుపుతోందని, ప్రైవేట్ ఆస్పత్రులను కూడా కొవిడ్ పరీక్షలకు అనుమతించి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించాలని అన్నారు. పేద, మద్య తరగతి ప్రజలు డబ్బు లేదా పలుకు బడి ఉంటేనే కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని బయటపడలెం అని, వారు అవేదన చెందుతున్న విషయాన్ని లేఖ లో స్పష్టంగా వివరించారు. అలాగే కొవిడ్ కు వ్యతిరేకంగా యుద్ధాన్ని గెలవడానికి జగన్ కు బలాన్ని ఇవ్వమని ప్రార్ధిస్తున్నానని అన్నారు.