మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నేడు రాష్ట్ర విభజన జరిగిన దుర్దినం రోజు అని ఫైర్ అయ్యారు. నేటికి రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందలేదని…దీనిపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై ఈనెల 22న విచారణ ఉందన్నారు.
తప్పు జరిగిన విషయాన్ని ఒప్పుకోవాలని… ఒప్పుకోకపోవడం వలనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వెల్లడించారు ఉండవల్లి అరుణ్ కుమార్. టిడిపి అధికారంలో ఉండగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి స్పందించలేదని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి ప్రయత్నించిన ఇప్పటికీ అవకాశం ఇవ్వలేదన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.