పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసి స్టేడియంలో బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ,కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,భవగత్ కుబా,తెలంగాణ గవర్నర్ తమిళ్ సై, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు లాభము కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, గత ప్రభుత్వాలు హయాంలో కేంద్రం 3750 కోట్లు ఖర్చు పెట్టేది బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం ధాన్యం కొనుగోలులో 26 వేల కోట్ల ఖర్చు పెడుతుందని ఆయన వెల్లడించారు. ధాన్యం కేంద్ర కొనలేదని ఎలా అంటారని మండిపడ్డ కిషన్ రెడ్డి.. ధాన్యం కొనుగోలు SFI ద్వారా లక్షల టన్నుల కొంటుందన్నారు.
2268 కోట్లతో మూడు జాతీయ రహదారులు విస్తరణ పనులుకు శంకుస్థాపన చేయనున్నారన్నారు. రామగుండంలో దేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లంట్ మోడీ ప్రారంభించారని ఆయన వివరించారు. సింగరేణి ని ఎవరు ప్రవేటు పరం చేస్తారని ఆయన అన్నారు. సింగరేణి ప్రవేటుపరం ఆలోచన బీజేపీ కి లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో మోడీ నాయకత్వంలో తెలంగాణ లో అన్ని గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందన్నారు కిషన్ రెడ్డి.