ఆక్సీజన్ కావాలా…? చెంప పగిలిపోద్ది… కేంద్ర మంత్రి వార్నింగ్

-

మన దేశంలో ఆక్సీజన్ కొరత చాలా తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ ఆస్పత్రులలో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గంగారాం ఆస్పత్రిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తరుణంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆసుపత్రిలో ఆక్సిజన్ సంక్షోభం గురించి ఓ వ్యక్తి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు ఫిర్యాదు చేస్తున్న సమయంలో మంత్రి సంయమనం కోల్పోయారు.

కేంద్ర పర్యాటక శాఖా మంత్రిగా ఉన్న ఆయన ఇలా బాధ్యత లేకుండా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఢిల్లీలో దాదాపు అన్ని ఆస్పత్రులలో ఆక్సీజన్ కొరత తీవ్రంగా ఉండటంతో యుద్ద విమానాల ద్వారా ఆక్సీజన్ తరలించే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఢిల్లీ ఆస్పత్రుల్లో మూడు రోజుల నుంచి ఆక్సీజన్ కొరత ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news