దేశంలో అన్ని రాజకీయ పార్టీలు 5 రాష్ట్రాల ఎన్నికలను వచ్చే సార్వత్రిక ఎన్నికలకు రిఫరెండంగా భావిస్తున్నాయి. దీంతో అన్ని పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందా.. అంటూ లెక్కలు వేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీకి ఈ ఎన్నిలకు కీలకంగా మారాయి. మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్, ఎస్పీ పార్టీలు పనిచేస్తున్నాయి. నాయకులు ప్రజల్ని ఆకట్టుకునే పని చేస్తున్నారు. అక్కడి ఆయా రాష్ట్రాల కల్చర్ కి అనుగుణంగా ప్రజల్లో కలిసిపోయేందుకు ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డ్యాన్స్ చేసింది. మణిపూర్ ఎన్నికల ప్రచారంలో ఉన్న స్మృతి ఇరానీ అక్కడి ప్రజలతో సంప్రదాయ నృత్యం చేశారు. ఇంఫాల్ ఈస్ట్‌లోని వాంగ్‌ఖీ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో డ్యాన్స్ చేశారు. కళాకారులకు అనుగుణంగా స్పెప్పులేశారు. ఈ వీడియో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. గతంలో కూడా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా ఇలాగే స్టెప్పులేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో అక్కడి ప్రజలతో కలిసి చిందేశారు. అప్పట్లో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రధాన మంత్రి.. కూడా కిరణ్ రిజిజు డ్యాన్స్ పై ప్రశంసలు కురిపించారు.
#WATCH | Union Minister Smriti Irani joins artists performing traditional dance at an event in Wangkhei area of Imphal East, Manipur pic.twitter.com/jQtqKMkOJW
— ANI (@ANI) February 18, 2022