టీఆర్ఎస్ నేత, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకు పడ్డారు. గాంధీ పెట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గాడిద పార్టీగా మారిందిని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బిజెపి వాళ్ళు ఏమి మాట్లాడతారో ఏమి చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి అని రసమయి అన్నారు. జాతీయ పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి ఏదో మాట్లాడుతారని.. అది ఇక్కడున్న వాళ్లకు అర్థం కాదని అన్నారు.
ఒకప్పుడు సిరిసిల్ల అంటే తెలియని ప్రాంతంగా ఉండేదని… ఎన్నో ఏళ్లు కళ్లలో నీళ్లు నములుకుంటూ బతికామని .. రామన్న ఆధ్వర్యంలో నేడు కొత్త కళ సంతరించుకుందని ఆయన అన్నారు. సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ కు రుణపడి ఉండాలని.. సిరిసిల్ల సిరుల తల్లిగా మారిందని రసమయి అన్నారు. గ్రామాల్లో ఇక ఏ పార్టీ ప్లెక్సీ కనబడ్డా వదలనని.. జిల్లా అధ్యక్షుడు ఆగన్న ఇక ఆగేది లేదని ఆయన ఇతర పార్టీను హెచ్చరించారు.