ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిపైై కేంద్రమంత్రి ట్వీట్ ను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రీ ట్వీట్ చేశారు. ” అనకాపల్లి రోడ్ల దయనీయ పరిస్థితి చూడండి. ఇదే నా అభివృద్ధి నమూనా. అనకాపల్లి నుండి అచ్చుతాపురం వరకు కేవలం 20 కిలోమీటర్ల ప్రయాణించడానికి గంటకు పైగా సమయం పట్టింది”. అని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ ట్విట్ చేశారు.
కేంద్ర మంత్రి చేసిన ఈ ట్వీట్ కి టిడిపి అధినేత చంద్రబాబు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ” వైయస్ జగన్ పాలనను కేంద్ర మంత్రులు కూడా గుర్తించారు. జగన్ ప్రభుత్వంలోని ఉత్తమ పాలసీలు చూసో, బెస్ట్ రిజల్ట్ చూసో కాదు.. మూడున్నర ఏళ్లుగా రాష్ట్ర ప్రజలకు నరకం చూపుతున్న రోడ్లను చూసి” అని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రులు కూడా రాష్ట్ర రోడ్ల దుస్థితిపై మాట్లాడడం ముఖ్యమంత్రి కి షేమ్ గా అనిపించడం లేదా అని ప్రశ్నించారు.
.@ysjagan పాలనను కేంద్ర మంత్రులు సైతం గుర్తించారు. అయితే ప్రభుత్వంలోని ఉత్తమ పాలసీలు చూసో… బెస్ట్ రిజల్ట్ చూసో కాదు. ఎపిలో మూడున్నరేళ్లుగా ప్రజలకు నరకం చూపుతున్న రోడ్లను చూసి.(1/2)#ChatthaRoadsChatthaCM #APRoads #WorstRoads #JaganFailedCM https://t.co/cv8BuDkcBv
— N Chandrababu Naidu (@ncbn) October 17, 2022