తెలంగాణలో బీర్ల సరఫరాను పునరుద్ధరించిన యునైటేడ్ బ్రూవరీస్ లిమిటేడ్

-

తెలంగాణలో అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ యునైటేడ్ బ్రూవరీస్ లిమిటేడ్ సంస్థ సరఫరాను పునరుద్ధరించింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ హామీతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు పేర్కొంది. ధరల పెంపు, బకాయిలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. గత రెండేళ్ల నుంచి రూ.702 కోట్ల బకాయిలను కార్పొరేషన్ విడుదల చేయకపోవడం.. బీరు ధరను సవరించాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బీర్ల సరఫరాను యూబీఎల్ నిలిపివేసిన విషయం విధితమే.

అయితే రాష్ట్రంలో ఆరు బీర్ల తయారీ సంస్థలు ఉన్నా మార్కెట్ లోకి వచ్చే వాటిలో 75 శాతం వాటా యూబీఎల్ దే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. దీంతో మద్యం ధరల పెంపు అంశం పై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో యూబీఎల్ సరఫరాను పునరుద్ధరించింది.

Read more RELATED
Recommended to you

Latest news