గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య

ప్రభుత్వాలు ఎన్ని కఠిన నియమ నిబంధనాలు తెచ్చినా… మహిళలపై దాడులు ఆగడం లేదు. రోజుకో ప్రాంతంలో మహిళలను పొట్టన పెట్టుకుంటున్నారు ఉన్మాదులు. తాజాగా… గుంటూరు జిల్లాలో రమ్య అనే పేరు గల బీటెక్ విద్యార్దిని దారుణంగా హత్య చేశాడు ఓ ఉన్మాది. ఒంటరి ఉన్న రమ్యను కత్తితో దాడిచేసి హతమర్చాడు. గుంటూరు లోని సెయింట్ మేరీస్ కాలేజిలో బిటెక్ 3వ సంవత్సరం చదువుతోంది నల్లపు రమ్య.

crime
crime

అయితే.. ఇవాళ బయటకు వచ్చిన రమ్యను అదును చూసి… కత్తితో దాడి చేసి చంపేశాడు ఓ యువకుడు. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇక.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… రమ్య హత్య కేసులో కీలకంగా మారింది ఆమె సెల్ ఫోన్. రమ్య సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు…. సెల్ ఫోన్ లాక్ ఓపెన్ చేసే పనిలో పడ్డారు. లాక్ ఓపెన్ చేస్తే హత్య కేసులో కీలక సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు పోలీసులు.