కనిపించని మెగా హీరో.. ఎక్కడ..?

-

మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రస్తుతం ఎక్కడ ప్రస్తావన రావడం లేదు. అందుకే ఆయన ఎక్కడ అంటూ ప్రతి ఒక్కరు ఆరా తీస్తున్నారు.ఇటీవల గని, F3 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మెగా హీరో తన తదుపరిచిత్రం విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్య ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా ప్రారంభం అయింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు కూడా ప్రకటించారు. కానీ ఈ సినిమా అప్డేట్ ఇప్పటివరకు వెలువడ లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. వరుణ్ తేజ్ పై నాగబాబు క్లాప్ కూడా కొట్టాడు.

ఈ ఏడాది మార్చిలో ఈ కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. షూటింగ్ ప్రారంభోత్సవం అయ్యే దాదాపుగా 9 నెలలు కావస్తున్నా.. ఇప్పటివరకు రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళిన దాఖలాలు కనిపించడం లేదు. గని ,ఎఫ్ త్రీ సినిమాల ఫలితాల విషయంలో వరుణ్ తేజ్ ఒకింత అసంతృప్తితో ఉన్నాడు. పైగా ప్రవీణ్ సత్తార్ కూడా తన గత చిత్రం ది ఘోస్ట్ తో పరాజయాన్ని మూట కట్టుకున్నాడు. అదే సమయంలో వీరి కాంబో మూవీ అంటే ప్రేక్షకులలో పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదు ఎందుకంటే అటువైపు గని చిత్రంతో డిజాస్టర్ కొట్టిన వరుణ్ తేజ్.. ఇటువైపు ది గోస్ట్ సినిమాతో డిజాస్టర్ మూట కట్టుకున్న ప్రవీణ్ కాంబోలో సినిమా అనేసరికి ప్రతి ఒక్కరు పెద్దగా పట్టించుకోలేదు.

ఆ కారణంగానే ఈ సినిమా హోల్డ్ లో పెట్టారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి వరుణ్ తేజ్ సినిమాలలో నటిస్తున్నట్లుగా ఎటువంటి అప్డేట్ రాలేదు. మరి వచ్చే ఏడాదిలో అయినా వరుణ్ తేజ్ సినిమాలు పట్టాలెక్కే అవకాశం ఉందేమో చూడాలి. ఈ క్రమంలోని షూటింగ్లో పాల్గొనకపోయినా ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news